ఇది దారుణం, రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తా : మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పార్క్ చేసిన తన వాహనానికి పార్కింగ్ ఫీజు అరగంటకు రూ.500 వసూలు చేయడంపై ప్రయాణీకుడు లబోదిబోమన్నాడు. పార్కింగ్ నిర్వాహకులతో వాదించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో చేసేదేమీ లేక బాధిత ప్రయాణీకుడు తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేవలం 31 నిమిషాలకు పార్కింగ్ ఫీజు రూ.500 వసూలు చేయడాన్ని కెటిఆర్ తప్పుబట్టారు. ఇది దారుణమని వ్యాఖ్యానించారు. నగరానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీపర్ ఎకె జైరథ్ ఈ నెల 4న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడున్న పార్కింగ్‌లో తన వాహనాన్ని పార్క్ చేశా డు. తన పని పూర్తయిన అనంతరం తిరిగి పార్కింగ్‌కు చేరుకున్నాడు.
తనకు ఇచ్చిన పార్కింగ్ ఫీజును చూసి ఆర్మీ ఆఫీస ర్ షాక్ అయ్యాడు. కేవలం 31 నిమిషాలకు రూ.500 వసూ లు చేయడమేంటని విస్తుపోయాడు. ఇదెక్కడి దారుణమని ప్రశ్నించాడు. అయినప్పటికీ పార్కింగ్ నిర్వాహకులు ఆయన మాటలు ఏ మాత్రం వినిపించుకోకుండా రూ.500 వసూలు చేశారు. పార్కింగ్ ఫీజు రూ.423.73 పైసలు కాగా, సిజిఎస్టీ, ఎస్‌జిఎస్టీ కింద రూ.38.14 చొప్పున వసూలు చేశారు. ఈ వ్యవహారాన్ని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మంత్రి కెటిఆర్ దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లారు. రైల్వే పార్కింగ్ ఫీజుపై కెటిఆర్ స్పందిస్తూ ఇది దారుణమన్నారు. పార్కింగ్ ఫీజులు అధికం గా వసూలు చేస్తున్న విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి కెటిఆర్ తీసుకెళ్లారు. దీనిపై అధికారులకు సూచనలు చేయాలని సూచించారు.