Friday, January 10, 2025

ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలవు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగే ఈ నెల 22న ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలవు ప్రకటించారు. అయోధ్యలో ‘ప్రాణప్రతిష్ఠ’ను పురస్కరించుకుని ఈ నెల 22న అన్ని ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాలు, ఇతర అండర్‌టేకింగ్స్‌లకు సగం రోజు సెలవును లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్సేనా ఆమోదం తెలియజేసినట్లు రాజ్ నివాస అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ నెల 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకు అన్ని ప్రభుత్వం కార్యాలయాలను మూసి ఉంచడానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News