Wednesday, January 22, 2025

రేపటినుంచి ఒంటిపూట బడులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో శుక్రవారంనుంచి ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకం మాత్రం యధావిధిగా కొనసాగుతుంది. పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులకు కూడా కొనసాగుతాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉదయం 8 గంటలకు తరగతులు మొదలై మధ్యాహ్నం 12.30కు జరుగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంటనుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పదవ తరగతి పరీక్షలు ముగిశాక, ఆ బడుల్లోనూ ఒంటిపూట తరగతులు నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News