Friday, November 15, 2024

ఫిఫ్టీ ఫిఫ్టీయే

- Advertisement -
- Advertisement -

కృష్ణ జలాల్లో సగం
వాటా ఇవ్వాల్సిందే

కృష్ణ బోర్డు ఎదుట గట్టిగా
పట్టుబట్టిన తెలంగాణ

మన తెలంగాణ/హైదరాబాద్ : జూన్ నుంచి ప్రా రంభమయ్యే నీటి సంవత్సరానికి సంబంధించి కృష్ణ నదిలో నీటి కోసం తెలం గాణ పట్టుబట్టింది. 66-34 శాతం వాటాలపై ఎపి ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. సమావేశం అనంతరం తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎపిక 66 శాతం, తెలంగాణకు 34శాతం నీటి వాటాలను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని తెల్చిచెప్పామన్నారు. పాత పద్దితినే కొనసాగిస్తామంటే కుదరదన్నామని తెలిపారు. గత ఏడాది నీటి వాటాలను ఇప్పుడు కూడా అదేవిధంగా కొనసాగించేందుకు వీల్లేదని తెగేసి చెప్పామన్నారు. ఉమ్మడిరాష్ట్రం ఉన్నప్పటినుంచే కొన్ని ప్రాజెక్టులు వినియోగంలో ఉన్నాయన్నారు. తెలంగాణ వరద నీటిపై చేపట్టిన ప్రాజెక్టులు కూడ ఉన్నాయన్నారు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు 225 నీరు అవసరం అని తెలిపామన్నారు. నీటికేటాయింపులకు సంబంధించి బోర్డుకు అధికారం లేదని బోర్డు చైర్మన్ వెల్లడించారన్నారు. ట్రిబ్యునల్‌కు నివేదిస్తారన్న అభిప్రాయంతోనే గత ఏడాది కేటాయింపులను షరతులతో అంగీకరించామని తెలిపారు.

ఈ సారి తాత్కాలిక కేటాయింపుల్లో చెరిసగం వాటా ఉండాల్సిందేనని బోర్డుకు తెలపామన్నారు. తెలంగాణకు 50శాతం వాటా ఇవ్వకుంటే సిడబ్యుసికి నివేదిస్తామన్నారు. ఆర్డీఎస్ రిపేర్లకు సమైక్యరాష్ట్రంలో మంజూరైన పనులు జరగటం లేదన్నారు. రిపేర్లకు సంబంధించి సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. వరదనీటి అధ్యయనం కోసం సబ్ కమిటి ఏర్పాటుకు నిర్ణయించినట్టు తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ సంబంధిత అంశాలను సమావేశంలో చర్చించామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జలవిద్యుత్ చాలా అవసరం అని తెలిపామన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలకు లోబడే జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశామన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి విషయంపై కమిటి ఏర్పాటుకు నిర్ణయం చేశామన్నారు. వదరనీటిపై ఆధారపడిన ప్రాజెక్టులు అయినందున నీటికేటాయింపులపై ట్రిబ్యునల్‌కు నివేదించాక డిపిఆర్‌లు అందజేస్తామనని తెలిపామన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ స్పిల్‌వేల రిపేర్లకు జివో ఇచ్చామని ,వాటిని పూర్తి చేస్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టు రిపేర్లపై అధ్యయనం జరిగిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు రిపేర్లకు రూ.800కోట్లు అవసరం అన్నారు. ఏపి అధ్యయనం చేసి బోర్డు ద్వారా ప్రతిపాదన పంపితే పరిశీలిస్తామని తెలినట్టు రజత్ కుమార్ స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News