Wednesday, January 8, 2025

ఆగస్టు 6న హాఫ్ మారథాన్ పోటీలు

- Advertisement -
- Advertisement -
  • నేడు చివరి రోజు సాయంత్రం ఆరులోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: సిపి శ్వేత

సిద్దిపేట: ఆరోగ్య సిద్దిపేటలో బాగంగా హాఫ్ మారథాన్ పోటీలు నిర్వహిస్తున్నామని సిపి శ్వేత అన్నారు. సిద్దిపేట రన్నింగ్ అసోసియేష, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. సోమవారకం విలేకరులతో మంత్రి హరీశ్‌రావు చోరవతో సిద్దిపేటలో భాగంగా ఆగస్టు 6న సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ ప్రాజెక్టు , సిద్దిపేట డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో 5కె,10 కె,21 కె ఆఫ్ మాథరన్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాఫ్ మారథాన్ పోటీలు సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ సమన్యవంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలోని చుట్టు పక్కల జిల్లాలు, రాష్ట్రంలో ఆసక్తి గల యువతీ యువకులు ,ఉత్సాహవంతులు ఆఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలో పాల్గొనేవారు.

https://shm23.iq301.com ఈ లింక్‌ను ఓపెన్ చేసి వారి యొక్క వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోని హాఫ్ మారాథాన్‌లో పాల్గొనాలన్నారు. ఈ లింక్ నేడు సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు 5కె 200 రూ. 10కె రూ. 300,21 కె 5000 గూగల్ పే, పోన్ పే , యూపిఐకోడ్ ద్వారా చెల్లించి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అందులో గెలుపొందిన వారికి 5కె,10కె,21కె లో గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేస్తామన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొని రన్నింగ్‌లో పాల్గొనే వారందరికి టీషర్ట్ , మెడల్స్ అందజేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News