Sunday, December 22, 2024

ఆగస్టు 6న జరిగే హాఫ్ మారథాన్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా సిద్దిపేట శివారులోని రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై హాఫ్ మారథాన్ నిర్వహించడం జరుగుతుందని జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. గురు వారం జడ్పీ చైర్‌పర్సన్ స్వగృహంలో ఆగస్టు 6న జరిగే మారథాన్ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్ణణ పరిసర ప్రాంతాల యువతి యువకులు ఆన్‌లైన్ లింక్ ద్వారా పేరు రిజిస్ట్రర్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సిద్దిపేట అభివృద్ధి తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచానికి తెలియపరిచే మంచి వేదిక అవుతుందన్నారు. ప్రతిఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ గురించి రన్నింగ్, యోగా, స్విమ్మింగ్, వాకింగ్, ద్యానం నిత్య జీవితంలో ఒక బాగం చేసుకోవాలన్నారు. రోజుకు ఒక గంట మన ఆరోగ్యం గురించి కేటాయిస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కత్తుల బాపురెడ్డి, అసోసియేషన్ సభ్యులు పరందాములు, రాజిరెడ్డి, రాజు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News