Thursday, January 23, 2025

మాజీ ప్రియుడు అనుకొని అర్థ నగ్న ఫోటోలు పంపించి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ప్రియుడు అనుకొని అర్థ నగ్న ఫోటోలు పంపించింది. మాజీ ప్రియుడు కాకపోవడంతో అతడు ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన సంఘటన హైదరాబాద్‌లోని శివరామ్‌పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహమ్మద్ మొహ్సిన్(22) అనే యువకుడు పెయింటర్ పని చేస్తున్నాడు. ఓ యువతికి ఫోన్ చేసి రాజుగా పరిచయం చేసుకున్నాడు. సదరు యువతి రాజును మాజీ ప్రియుడిగా భావించి రోజు ఫోన్‌లో మాట్లాడేది. ఇరువురు రోజూ ఫోన్‌లో గంటల కొద్దీ మాట్లాడేవారు. ఒక రోజు యువతి అర్థ నగ్న ఫోటోలను తన ప్రియుడికి పంపించింది. ఇద్దరు కలుసుకోగా అతడు తన మాజీ ప్రియుడు కాదని తెలుసుకుంది. వెంటనే ఫోటోలను తొలగించామని అతడిని బతిమిలాడింది. అతడు ఫోటోలు తొలగించకపోవడంతో పాటు డబ్బులు ఇవ్వాలని ఆమెను మొహ్సిన్ డిమాండ్ చేశాడు. వెంటనే ఆమె షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News