Wednesday, January 22, 2025

హాలియా మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:కేసీఅర్ నేతృత్వంలో మంత్రులు కేటీఅర్, జగదీష్‌రెడ్డిల సహాకారంతో హాలియా మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం హాలియా మున్సిపాలిటీలోని 2,12 వార్డులలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాఫన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గతంలో పాలించిన కాంగ్రెస్ నాయకుఉల ఎ న్న డూ మాలియాను మున్సిపాలిటీగా చేయడానికి కానీ, అభివృద్ధి గురించి కానీ పట్టించుకోలేదన్నారు. నేడు హాలియా పట్టణంలో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్, మినీ స్టేడియం, డిగ్రీ కళాశాల ఏర్పాటుతో మున్సిపాలిటీ అ భివృద్ధి చెందిందన్నారు.

మైనార్టీలకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే భగత్
మైనార్టీ కార్పోరేషన్ నిధుల నుంచి చిరు వ్యాపారులకు 80 శాతం సబ్సిడీతో అందిస్తున్న సబ్సిడీ రుణాల చెక్కులను 11 మంది మైనార్టీకు 15 లక్షల రూపాయల విలువల గల చెక్కులను ఎమ్మెల్యే నోముల భగత్ హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కులాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను అదుకుంటున్న నాయకులు కేసీఅర్ అని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో జెడ్‌పీ వై స్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్‌లు జవ్వాజి వెంకటేశ్వర్లు, మర్ల చ ంద్రారెడ్డి, యడవల్లి మహేందర్‌రెడ్డి, వెంపటి శంకరయ్య, కూరాకుల వెంకటేశ్వర్లు, చెరుపల్లి ముత్యాలు, నల్లగొండ సుధాకర్, రామలింగయ్య, నల్లబోతు వెంకటయ్య, కేశ శంకర్, ఎన్నమల్ల సత్యం, దొరేపల్లి వెంకన్న, సురభి రాంబాబు, చాపల సైదులు, చెన్ను డొనిమిక్, అన్వర్, రామలింగయ్య, బందిలి సైదులు, మట్టారెడ్డి, సైదులు, షకీల్, జానకిరాములు, మారయ్య, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News