Friday, November 22, 2024

హమాస్ దాడి.. మానవళికి దిగ్భ్రాంతి : బిజెపి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడి క్రూరమైంది.. కేవలం మతం ఆధారంగా హింసను ప్రేరేపించిన దుర్ఘటనపై ప్రపంచంలోని మానవాళి దిగ్భ్రాంతి చెందిందని బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ పి.మురళీధర్‌రావు అన్నారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్-, పాలస్తీనా మధ్య వివాదం నేపథ్యంలో హమాస్ ముష్కరులు పాశవికంగా దాడులు చేయడం దిగ్భాంత్రి కలిగించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశ దృక్పథాన్ని స్పష్టం చేశారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు.

ఉగ్రవాద కార్యకలాపాలతో నష్టపోయి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న దేశం భారత్ అని వెల్లడించారు. ప్రపంచశాంతికి భంగం కలిగించేలా జరుగుతున్న పరిణామాలతో భారత్ ఇజ్రాయిల్ కు రక్షణ కల్పించేలా అండగా నిలిచిందన్నారు. తెలంగాణ ఉగ్రవాద పీడిత ప్రాంతం. అనేక ఘర్షణలతో నష్టపోయిన ప్రాంతం. ఉగ్రవాదంపై రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏంటో తెలపాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ఉగ్రవాదంపై ఎంఐఎం, -కాంగ్రెస్ ప్రకటన ఒకే విధంగా ఉందని ఆరోపించారు. జాతీయ భద్రతకు ఏమైనా పర్లేదు.. పార్టీకి ప్రయోజనం చేకూరితే చాలు అని బిఆర్‌ఎస్ భావిస్తోందని విమర్శించారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, సీనియర్ నాయకులు కపిలవాయి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News