Sunday, December 22, 2024

టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్: ఇరాన్‌లోని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు.  ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు టెహ్రాన్‌కు వెళ్లిన హనియేను చంపేశారు. హనియే ఎలా హత్యకు గురయ్యారనే వివరాలు ఇప్పటివరకు ఇరాన్ వెల్లడించలేదు. హనియే హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఇరాన్ సైన్యం పేర్కొంది. హమాస్ చీఫ్ హత్యకు ఇజ్రాయెల్ నిఘా సంస్థే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నెతన్యాహూ ప్రభుత్వం హనియేను చంపుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే గత కొంత కాలంగా ఖతార్ లో నివసిస్తున్నారు. హనియే హత్యపై ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ స్పందించలేదు. హమాస్ చీఫ్ హనియే హత్యతో ఉద్రిక్తత మరింత పెరగనుంది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా కృషి చేస్తోంది. కీలక సమయంలో హనియే హత్య ఘటన పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News