Monday, December 23, 2024

హమాస్‌కు మరో దెబ్బ

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: హమాస్ సైనిక విభాగం అధిపతి మహమ్మద్ డెయిఫ్ జులైలో గాజాలోని వైమానిక దాడుల్లో హతమైనట్టు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో జులై 13న జరిపిన దాడుల్లో అతడు హత మైనట్టు నిర్ధారించింది. గత ఏడాది అక్టోబర్ 7న జరిగిన మెరుపు దాడులకు డెయిఫ్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. ఈ దాడుల్లో 90 మంది కన్నా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో శిబిరాలకు దగ్గరలో ఉన్న నిర్వాసితులైన పౌరులు కూడా ఉన్నారని గాజా ఆరోగ్య అధికార వర్గాలు ప్రకటించాయి. దీనిపై హమాస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

టెహ్రాన్‌లో హమాస్ టాప్ పొలిటికల్ లీడర్ ఇస్మాయిల్ హనీయే బుధవారం వైమానిక దాడికి అంతమైన సంఘటన తరువాత గురువారం ఇజ్రాయెల్ స్పందించడం గమనార్హం. డెయిఫ్, హనీయే తోపాటు మరో టాప్ లీడర్ యెహ్యా సిన్వర్ ఆచూకీ అంతుచిక్కడం లేదు.. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 నాటి దాడిలో డెయిఫ్, సిన్వర్ సూత్రధారులని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఆనాటి దాడిలో హమాస్ నేతృత్వం లోని మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్ ప్రజలు బలయ్యారని, 1200 మంది మృతి చెందారని 250 మంది బందీలయ్యారని ఇజ్రాయెల్ వెల్లడించింది. హమాస్ మిలిటరీ విభాగం కస్సామ్ బ్రిగేడ్స్ సంస్థాపకుల్లో డెయిఫ్ ఒకరు. 1990లో ఏర్పాటైన ఈ విభాగం కొన్ని దశాబ్దాలపాటు సా గింది. డెయిఫ్ నాయకత్వంలో ఇజ్రాయెల్‌పై ఆత్మాహుతి దాడులు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News