దక్షిణ లెబనాన్‌లో మిలిటెంట్ హమాస్ అధినేత సోమవారం తమ డ్రోన్ దాడిలో హతమయ్యాడని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా తన సైన్యాన్ని ఉపసంహరించుకునే గడువు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ డ్రోన్ దాడి జరిగింది. లెబనాన్‌లో హమాస్ ఆపరేషన్స్ విభాగం హెడ్ మొహమ్మద్ షహీన్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇరాన్ నిధుల సాయంతో లెబనీస్ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పౌరులపై దాడులకు పన్నాగం పన్నుతున్నాడని ఆరోపించింది. లెబనీస్ ఆర్మీ చెక్‌పాయింట్, సిడాన్స్ మున్సిపల్ స్పోర్ట్ స్టేడియం వద్ద ఒక కారు మంటల్లో దగ్ధమైపోతున్న దృశ్యం ఫుటేజీలో కనిపించింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యాలు వైదొలగడానికి అసలు గడువు జనవరి కాగా, ఇజ్రాయెల్ ఒత్తిడి కారణంగా ఫిబ్రవరి 18 వరకు గడువు పొడిగించడానికి లెబనాన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరగడం గమనార్హం
ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో హమాస్ అధినేత హతం
- Advertisement -
- Advertisement -
- Advertisement -