Wednesday, January 22, 2025

ప్రపంచమంతా మా చట్టం తెస్తాం..

- Advertisement -
- Advertisement -

టెల్‌అవీవ్ : ఓవైపు గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు తీవ్రతరం చేస్తుండగా.. హమాస్ మరింత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. హమాస్ కమాండర్ తమ సభ్యులకు ఓ కీలక సందేశాన్ని ఇచ్చాడు. ఇజ్రాయెల్ తమ తొలి లక్షం మాత్రమేనని, యావత్ ప్రపంచంపై తమ ప్రభావాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అతడు ప్రకటించాడు. హమాస్ కమాండర్ మహ్‌మౌద్ అల్ జహార్ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో జహార్‌తో పాటు పలువురు హమాస్ సీనియర్ అధికారులు కన్పించారు. నిమిషానికి పైగా నిడివి ఉన్న ఆ వీడియోలో జహార్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ కేవలం ప్రారంభ టార్గెట్ మాత్రమే.

యావత్ భూగోళం మన చట్టం కిందకు రావాలి. యావత్ ప్రపంచంలో ఎలాంటి అన్యాయం, అణచివేత లేని వ్యవస్థ ఉండాలి. లెబనాన్, సిరియా, ఇరాక్ వంటి దేశాల్లో అరబ్‌లు, పాలస్తీనీయన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు, హత్యలు ఇంకెక్కడా చోటుచేసుకోకూడదు అని అన్నాడు. హమాస్, లెబనాన్, సిరియాల నుంచీ ఇజ్రాయెల్ రాకెట్ దాడులను ఎదుర్కొంటున్న వేళ జహార్ వీడియో కలకలం రేపుతోంది. లెబనాన్‌లోని హిజ్‌బొల్లా, సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగడంతో ఈ యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News