Sunday, January 19, 2025

హమాస్ అగ్రనేత అహ్మద్ వధ నిజమే

- Advertisement -
- Advertisement -

డియిర్ అల్ బలాహ్: తమ బలగానికి చెందిన ప్రముఖ కమాండర్లలో ఒకరు మృతి చెందినట్లు హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్‌తో ఇప్పటి ఘర్షణల దశలో టాప్ కమాండర్ అహ్మద్ అల్ ఘాందౌర్ మృతి చెందిన విషయాన్ని హమాస్ ఆదివారం ప్రకటించింది. అయితే ఎప్పుడు? ఎక్కడ ఈ కమాండర్ బలి అయ్యిందనేది వెల్లడించలేదు. హమాస్ మిలిటెంట్ల దళంలో అహ్మద్ అత్యున్నత స్థాయి నేతగా చలామణిలో ఉన్నారు. ఇజ్రాయెల్ భూభాగంలోకి వెళ్లి హమాస్ దాడులు నిర్వహించడంలో ఈ కమాండర్ కీలక పాత్ర వహించారని భావిస్తున్నారు. అహ్మద్‌ను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ రక్షణ విభాగంసేనలు కనీసం మూడుసార్లు యత్నించాయి.

2002లో కూడా ఆయనను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ విఫల యత్నం చేసింది. ఈ కమాండర్ మృతి చెందిన విషయాన్ని తెలిపిన హమాస్ ప్రస్తుత ఘర్షణల దశలో ఆయన చనిపొయ్యాడా? లేక చాలా ఏండ్ల క్రితమే చంపివేశారా? అనేది వెల్లడించలేదు. అహ్మద్ ఉత్తర గాజా ప్రాంతానికి హమాస్ బ్రిగేడ్ కమాండర్‌గా ఉన్నారు. 2017లో ఆయనను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News