Friday, December 27, 2024

హమాస్ మెరుపు దాడి

- Advertisement -
- Advertisement -

బీరూట్ : ఇజ్రాయెల్‌పై ఇప్పుడు అల్ అక్సాఫ్లడ్ ఆపరేషన్ చేపట్టిన హమాస్ ఇజ్రాయెల్ ఆధిపత్య ధోరణికి ప్రతిఘటన క్రమంలో ఆవిర్భవించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పుడు గాజాస్ట్రిప్‌లో దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లతో కూడిన ప్రాంతంలో తన సర్కారును ఏర్పాటు చేసుకుని ఉంది. ఇజ్రాయెల్‌కు దెబ్బకు దెబ్బ, సాయధ పోరే తమ లక్షంగా హమాస్ చెపుతుంది. హమాస్ అరబిక్ పదవిశేషణం, హరాకాహ్ అల్ ముకావామహ్ అల్ ఇస్లామియాహ్ అంటే ఇస్లామిక్ ప్రతిఘటనోద్యమం దీనిని సంక్షిప్తంగా హెచ్‌ఎంఎస్‌గా వ్యవహరిస్తారు. పదంగా హమాస్‌గా స్థిరపడింది. హమాస్ అంటే పట్టుదల, సాహసం ధైర్యం,సత్తా. మొత్తం మీద చూస్తే హమాస్ ఓ సైనిక బృందం,పాలస్తీనియన్ల దృష్టిలో ఇది వీరుల కలయిక. అయితే దీనిని ఇజ్రాయెల్ చాలాకాలం క్రితమే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఐరాస, యూరోపియన్ యూనియన్, బ్రిటన్ ఇతర దేశాలు కూడా దీనికి టెర్రరిస్టు ముద్ర వేశాయి. 1980లో హమాస్ ఏర్పాటు అయింది. దీనిని షేక్ అహ్మద్ యాసిన్ స్థాపించాడు.

ఈ వ్యక్తి తన 12వ ఏట నుంచే వీల్‌చైర్‌పై ఉంటూ వచ్చాడు. ఈ ప్రాంతంలో హమాస్‌ను రాజకీయ పార్టీగా కూడా తీర్చిదిద్దాడు. ఇది చివరికి ఓ దశలో అరాఫత్ ఫతా పార్టీ కన్నా అత్యంత జనాదరణ పొందింది. వెస్ట్‌బ్యాంక్ , గాజాస్ట్రిప్‌లలో ఇజ్రాయెల్ ఆక్రమణల క్రమంలో తలెత్తిన తొలి పాలస్తీనియా ఉద్యమ తీవ్రత దశలో ఈ సంస్థ అవతరించింది. 1967 ఇజ్రాయెల్ అరబ్ యుద్ధంలో ఈ రెండు పాలస్తీనియా ప్రాంతాలు ఇజ్రాయెల్ స్వాధీనంలోకి వచ్చాయి. పాలస్తీనియాకు చెందిన ముస్లిం సహోదరత్వం వాదన తొలిసారిగా 1946లో జెరూసలేంలో తలెత్తింది. ఇది అంతర్గత పరిణామాలు , మరింతగా సంఘటితం క్రమంలో హమాస్ సంస్థగా అవతరించిందని ప్రొఫెసర్ ఖాలీద్ అల్ హ్రోబ్ రాసిన హమాస్ ః ఏ బిగైనర్స్ గైడ్ పుస్తకంలో పేర్కొన్నారు. చాలా కాలం వరకూ పాలస్తీనియా ముస్లింలు ఇజ్రాయెల్‌తో ఘర్షణలు లేకుండానే ఉంటూ వచ్చారు. తాము పాలస్తీనియా సమాజాన్ని ముస్లిమీకరణ చేయాలని భావించారు. దీని తరువాతనే ఇజ్రాయెల్‌తో తీవ్రస్థాయి పోరుకు దిగేందుకు సన్నద్ధతను సంతరించుకోవచ్చునని విశ్వసించారు.

సాయుధ పోరుకు దిగలేదని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే 1987లో తొలిసారిగా పాలస్తీనియా తిరుగుబాటు తలెత్తింది. అంతవరకూ ఉన్న పాలస్తీనియా పునరుజ్జీవ ప్రక్రియకు కొత్త దశ ఏర్పడింది. ఈ సంస్థ తమ వైఖరిని పూర్తిగా మార్చివేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. పరిణామాత్మక క్రమం అప్పుడు నెలకొంది. ఇజ్రాయెల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిర్థిష్ట రీతిలో పోరుకు దిగేందుకు సమాయత్తం అయింది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. 1980 ప్రాంతంలో తలెత్తిన పాలస్తీనియా జాతీయ ఉద్యమం వైఫల్యం చెందిందనే భావన బలోపేతం కావడం హమాస్ ఏర్పాటుకు దారితీసింది. 1960 ప్రాంతంలో యాసర్ అరాఫత్ సారధ్యంలో వెలిసిన పాలస్తీనియా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పిఎల్‌ఒ) సాయుధ పోరాటం తీవ్రస్థాయిలో జరిపింది. అయితే చివరి దశలో ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో స్థిరపడిపొయ్యేలా ఒప్పందానికి దిగిందని విమర్శలు తలెత్తాయి. 1990లో ఇజ్రాయెల్ పాలస్తీనియా మధ్య కుదిరిన ఒస్లో శాంతి ఒప్పందంపై పాలస్తీనియన్లలో నెలకొన్న అసంతృప్తి హమాస్ బలోపేతానికి దారితీసింది.

అప్పటి అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ మధ్యలో ఉండగా చెరోవైపు యాసర్ అరాఫత్, మరో వైపు ఇజ్రాయెల్ అప్పటి ప్రధాని ఇత్‌జక్ రబిన్‌లు నిలిచి వైట్‌హౌస్ లాన్స్‌లో దిగిన ఫోటోను ఉటంకిస్తూ ఓ వైపు ఇజ్రాయెల్‌ను ఆక్రమిత ప్రాంతంలో ఉండేలా చేస్తూనే స్వయం నిర్ణయాధికార ప్రాంతంగా పాలస్తీనియాకు గుర్తింపు రావడం వంటివి కేవలం ప్రపంచ ప్రాబల్య దేశాలు ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని బలోపేతం చేసేందుకు, తెలివిగా పాలస్తీనియన్లను దెబ్బతీసేందుకు పన్నిన ఎత్తుగడగా తలెత్తిన వాదనలో నుంచి బలీయమైన రీతిలో సాయుధ సంఘర్షణల వేదికగా హమాస్ పుట్టుకొచ్చింది. అప్పటి ఒప్పందాన్ని నివారించేందుకు హమాస్ సంస్థ పలు చోట్ల ఆత్హాహుతి దాడులకు దిగింది. బస్సులపై బాంబులు కురిపించింది. పలువురు ఇజ్రాయెలీలు ఈ దాడులలో మృతి చెందారు. ఈ దశలోనేఏ ఇజ్రాయెల్ దళాలు హమాస్ సంస్థకు చెందిన ప్రధాన బాంబు తయారీ నిపుణుడు యాహ్యా అయ్యాష్‌ను 1995 డిసెంబర్‌లో ఓ దాడిలో చంపేసింది. దీనికి ప్రతిగా హమాస్ మరింత భీకరంగా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది.

మధ్యమధ్యలో వ్యూహాత్మక విరామం పాటించి జరుపుతున్న దాడుల క్రమంలో ఇప్పుడు భీకర స్థాయి చర్యకు దిగినట్లు స్పష్టం అయింది. ఇంతకు ముందు హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన భీకర ఘర్షణలు మారణహోమానికి దారితీశాయి. 2014లో ఇరు పక్షాల నడుమ జరిగిన భీకరదాడులలో కనీసం 2251 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వీరిలో 1462 మంది సామాన్య పౌరులు. 50 రోజుల పాటు సాగిన అప్పటి పోరులో ఇజ్రాయెల్‌కు చెందిన 67 మంది సైనికులు మృతి చెందారు. ఆరుగురు పౌరులు బలి అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News