Wednesday, January 22, 2025

హమాస్ అధినేత సిన్వర్ హతం…. అలా చేస్తే రేపే యుద్ధానికి ముగింపు పలుకుతాం

- Advertisement -
- Advertisement -

గాజా: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ అధినేత యాహ్వా సిన్వర్ మృతి చెందాడు. యాహ్వా సిన్వర్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ద్రువీకరించింది. డిఎన్‌ఎ టెస్టు ఆధారంగా సిన్వర్ చనిపోయాడని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. గత సంవత్సరం అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడిలో సిన్వర్ కీలక సూత్రదారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సిన్వర్ మృతి ఇజ్రాయెల్, ప్రపంచానికి మంచి రోజు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. బందీల విడుదలకు ఒప్పందం కుదిరి యుద్ధం ముగుస్తుందని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఎట్టకేలకు హమాస్ అధినేత సిన్వర్ హతం కావడంతో యుద్ధం ముగింపు చేరుకుందని పలు దేశాలు భావిస్తున్నాయి. 250 మంది బందీలను వదిలిస్తే యుద్ధానికి ముగింపు పలుకుతామని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ప్రకటించారు. బందీలను వదిలిస్తే హమాస్ తీవ్రవాదులు బయట జీవించే అవకాశం కల్పిస్తామని, లేదంటే వేటాడి వెంటాడి చంపేస్తామని నేతన్యాహు హెచ్చరించారు. వేలాది మంది ఇజ్రాయెల్ సౌరులను చంపేసిన హంతకుడిని అంతం చేశామన్నారు. ఇది ఇజ్రాయాల్‌కు అతి పెద్ద విజయమని, గాజాతో యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News