Saturday, November 23, 2024

తల్లి గర్భాన్ని చీల్చి పిండాన్ని కూడా..

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్ : ఇజ్రాయెల్‌లో హమాస్ తాలూకు అత్యంత దారుణ మారణ హోమానికి సంబంధించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తునాయి. మానవత్వానికి మచ్చ తెచ్చిపెట్టే ఘటనలకు మిలిటెంట్లు పాల్పడ్డారు. ఇజ్రాయెల్‌లోకి చొరబడిన సమయంలో కంటికి కనిపించిన ఎవ్వరినీ వదలలేదు. మహిళలపై అయితే వారి అఘాయిత్యాలకు అంతేలేదు. చివరికి గర్భిణీతో పాటు ఆమె కడుపులో ఉన్న పిండాన్ని కూడా ఛిద్రం చేసి రాక్షస ఆనందాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అష్‌దోద్ ప్రాంతానికి చెందిన యోసి లాండౌ కళ్లకు కట్టినట్లు వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘జాకా’ అనే సంస్థలో యోసి లాండౌ వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల సమయంలో అసహజ మరణాలు సంభవించినప్పుడు ఈ జాకా అనే సంస్థ అక్కడి మృతదేహాలను సేకరిస్తుంటుంది. 33 ఏళ్లుగా లాండౌ ఇందులో విధులు నిర్వర్తిస్తుండడమే ఆయన పని. తాజా ఇజ్రాయెల్, గాజా యుద్ధంలోనూ సంస్థ తరపున లాండౌ విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఎన్నో భయానక రీతిలో ఛిద్రమైన ఎన్నో శరీరాలను దగ్గర్నుంచి చూసిన అతడు తాజా మారణహోమంలో శవాల దిబ్బలను చూసి తన గుండె బద్దలైందని తెలిపాడు.

హమాస్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఓ గర్భిణి మృతదేహాన్ని చూసి న్నీటి పర్యంతమయ్యాడట. తల్లి పొట్టను చీల్చి మరీ లోపలున్న బిడ్డను చంపడం చూసి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారట..! ఒళ్లు గగుర్పొడిచే ఆ భయానక ఘటనలను అతడు ఓ అంతర్జాతీయ మీడియాకు వివరించారు. ‘హమాస్ దాడి జరిగిన తర్వాత మృతదేహాలను సేకరించేందుకు మా బృందంతో కలిసి గాజా సరిహద్దుకు బయల్దేరాం. ఆ దారిలో మేం చూసిన దృశ్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురిచేశాయి. సరిహద్దు సమీప ప్రాంతాల్లో అనేక కార్లు బోల్తా పడ్డాయి. వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇన్నేళ్లలో మేం ఎన్నడూ ఇలాంటి దారుణ హింసను చూడలేదు. ఒక రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలను సేకరించేందుకు మేం వెళ్లాం. ప్రతి మృతదేహాన్ని బ్యాగుల్లో పెడుతూ మేం ఆ రోడ్డు దాటేసరికి 11 గంటలు పట్టిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి బీరీ ప్రాంతానికి చేరుకున్నాం. ఈ ప్రాంతం గాజాకు కేవలం 5 కి.మీల దూరంలోనే ఉంటుంది. అక్కడ మొదట ఓ ఇంట్లోకి వెళ్లి ఓ మహిళ మృతదేహాన్ని చూశాం. ఆమె పొట్టను చీల్చారు. అందులో బిడ్డ ఉంది. ఇంకా బొడ్డుతాడు కూడా తెగని ఆ బిడ్డను పొడిచి చంపారు అంటూ లాండౌ కన్నీటిపర్యంతమయ్యాడు. కొందరు పౌరుల చేతులను వెనక్కి కట్టి వారిని హింసించి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News