Wednesday, January 22, 2025

కాల్పుల విరమణ చర్చల్లో హమాస్ పాల్గొనబోవడం లేదు

- Advertisement -
- Advertisement -

గాజా: ఖతార్‌లో జరగనున్న కాల్పుల విరమణ చర్చల్లో ఉద్యమం పాల్గొనబోదని హమాస్ అధికారి ఒకరు తెలిపారు. హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు సుహైల్ హిందీ,  విలేకరుల సమావేశంలో “ఖతార్ రాజధానిలో గురువారం తిరిగి ప్రారంభం కానున్న  చర్చలలో హమాస్ బృందం పాల్గొనదు” అని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదన మేరకు జూలై 2న కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉండేందుకు ఇజ్రాయెల్‌ను హమాస్ స్పష్టమైన నిబద్ధత కోరిందని హిందీ స్పష్టం చేసినట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. పూర్తి అధికారంతో గాజాలో కాల్పుల విరమణపై చర్చించేందుకు చర్చల ప్రతినిధి బృందాన్ని ఖతార్‌కు పంపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆమోదం తెలిపిన కొద్దిసేపటికే హమాస్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

ఆగస్టు 14 లేదా 15న కైరో లేదా దోహాలో చర్చలను పునఃప్రారంభించాల్సిందిగా ఈజిప్ట్, ఖతార్ , యుఎస్ ఆహ్వానం మేరకు ఈ సమావేశం షెడ్యూల్ చేశారు. ఈజిప్టు ప్రకటన ప్రకారం, ఈ చర్చలు అసాధారణ సమస్యలను పరిష్కరించడం, గాజాలో  పరిస్థితిని చక్కబెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

గాజాలో కాల్పుల విరమణ కు సంబంధించిన బైడెన్ ప్రణాళికను సమర్పించాలని హమాస్ ఇదివరలో ఈజిప్టు, ఖతార్, అమెరికా మధ్యవర్తులను కోరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News