Saturday, February 22, 2025

హమాస్ ఉగ్రవాద సంస్థ అనలేదు: కేంద్ర మంత్రి లేఖీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హమాస్‌ను ఉగ్రవాద సంస్థ అని తాను అనలేదని, సంబంధిత ప్రకటనపై ఎటువంటి సంతకం చేయలేదని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ శనివారం తెలిపారు. కేంద్ర మంత్రి పదవిలో ఉన్న లేఖీ హమాస్‌పై స్పందనకు దిగారని తెలిపే ఫోటోలు సామాజిక మాధ్యమంలో వెలువడ్డాయి. వీటిని లోక్‌సభలో విపక్షాలు శనివారం ప్రదర్శించాయి. దీనిపై వివరణ కోరగా కేంద్ర విదేశాంగ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అయిన లేఖీ జవాబు ఇచ్చారు.తన ఇంతకు ముందటి జవాబు విషయంలో కొంత వివరణ ఇచ్చుకోవల్సి వచ్చిందని తెలిపిన మంత్రి తాను ఏ దశలోనూ హమాస్ విషయంలో ఎటువంటి స్పందనకు దిగలేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News