Tuesday, December 24, 2024

50 మంది బందీలను వదలనున్న హమాస్… ఇజ్రాయెల్ కాల్పుల విరమణ

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: గత నెలన్నర నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుతుంది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడంతో ఇండ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు ధ్వంసమయ్యాయి. అంతర్జాతీయ సమాజం కలుగజేసుకొని యుద్ధానికి స్వస్థి పలకాలని పిలుపునిచ్చాయి. 50 మంది బందీల విడుదల కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం కుదిరడంతో ప్రధాని నేతన్యాహు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కష్టమైందే కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని మంత్రులతో నెతన్యాహు పేర్కొన్నారు. దీంతో నాలుగు రోజుల పాటు ఇజ్రాయెల్ కాల్పులకు స్వస్థి పలకనుంది. హమాస్ వద్ద ఇజ్రాయెల్‌కు చెందిన 250 మంది సౌరులు ఉన్నారు. 50 మంది మహిళలు, చిన్నారులను విడిచిపెడుతామని హమాస్ తెలిపింది. బందీలను సురక్షితంగా తమ దేశానికి తీసుకరావమే తమ లక్ష్యమని, తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 150 పాలస్తీనా పౌరులను కూడా విడిచి పెడుతుందని ఖతార్ ఒక ప్రకటనలో తెలిపింది, కానీ ఇజ్రాయెల్ ఎక్కడా స్పందించడం లేదు. అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంలోనే ఇజ్రాయెల్-హమాస్ మధ్య డీల్ కుదిరినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News