Sunday, February 16, 2025

హమాస్ నుంచి మరో ముగ్గురు బందీల విడుదల

- Advertisement -
- Advertisement -

గాజాసిటీ : ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ముగ్గురు బందీలను హమాస్ శనివారం విడుదల చేసి రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్ డెకెల్ చెన్ (36),అలెగ్జాండర్ ట్రుపనోవ్ (29), యైర్ హార్న్(46)లను విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. ఖతర్, ఈజిప్టు మధ్యవర్తిత్వంలో గత నెల ఇజ్రాయెల్‌హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఈమేరకు హమాస్ తమ చెరలోని 94 మంది బందీల్లో 33 మందిని విడుదల చేయనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనియులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకు పలు దఫాలుగా 21 మంది బందీలను మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా, 730 మంది పాలస్తీనా ఖైదీలకు టెల్‌అవీవ్ విముక్తి కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News