Saturday, November 23, 2024

పాలస్తీనాపై యుద్ధ మేఘాలు

- Advertisement -
- Advertisement -

Hamas rocket attacks on Israeli territory

ఇజ్రాయెల్ భూభాగంపైకి హమాస్ రాకెట్ దాడులు
ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు: 24 మంది మృతి

గాజా సిటీ: పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తొలుత పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ సోమవారం ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు జరిపింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ వాయుసేన స్పందించింది. వివాదాస్పద గాజా ప్రాంతంలో సోమవారం నిర్వహించిన వాయుసేన దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 24 మంది మృతి చెందారు. వీరిలో పలువురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం కూడా ఇజ్రాయెల్ హమాస్ ఫీల్డ్ కమాండర్‌కు చెందిన ఓ బహుళ అంతస్తుల భవనంపైన, హమాస్ మిలిటెంట్లు తవ్విన రెండు సొరంగాలపైనా రాకెట్ దాడులు జరిపింది. ఇటీవల కాలంలో పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరిగిన అతిపెద్ద ఘర్షణగా దీన్ని భావిస్తున్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన జెరూసలెంలోని అల్ అక్సా మసీదు వద్ద గత శుక్రవారం భద్రతా దళాలకు, స్థానికులకు మధ్య భారీగా ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఇరు వర్గాలకు చెందిన అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.

తూర్పు జెరూసలెంలోని షేక్ జర్రా, సిల్వన్ వద్ద పాలస్తీనియన్లను ఖాళీ చేయించే క్రమంలో వివాదం మొదలైంది. ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు గతంలో ఈ భూమి యూదు సెటిలర్లకు చెందుతుందని తీర్పు ఇచ్చింది. అయితే 1876 తర్వాత జోర్డాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో పాలస్తీనియన్లు వచ్చి స్థిరపడ్డారు. 1967 యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకునే అంశంపై ఘర్షణ లైంది. గత శుక్రవారం కొంతమంది ఇజ్రాయెల్ దళాలతో ఘర్షణ పడుతూ అల్ అక్సా మసీదులో దాక్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన ఇజ్రాయెల్ దళాలకు, ప్రార్థనలకు వచ్చిన వారికి మధ్య ఘర్షణలు మొదలైనాయి.

ఇజ్రాయెల్ దళాలు వారిని చెదరగొట్టగా, ఆందోళనకారులు రాళ్లు , పెట్రోలు బాంబులతో దాడి చేశారు. సోమవారం జెరూసలెం దినోత్సవం సందర్భంగా మరోసారి ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి. దీనికి ప్రతిగా గాజా ప్రాంతంనుంచి హమాస్ మిలిటెంట్లు రాకెట్ దాడులు జరిపారు. వందల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ దాడుల్లో తమ సైనికులు కొంతమంది గాయపడినట్లు కూడా తెలిపింది. కాగా హమాస్‌ను ఏమాత్రం వదిలిపెట్టేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. వారు ఎర్రగీతను దాటారని, ఇజ్రాయెల్ అంతే శక్తితో దాన్ని ప్రతిఘటిస్తుందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News