Wednesday, January 22, 2025

హమాస్ బందీ నుంచి 10 మంది ఇజ్రాయెలీలు విడుదల

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: గాజా స్ట్రిప్ హమాస్ బందీ నుంచి పదిమంది ఇజ్రాయెలీలు. నలుగురు థాయ్ జాతీయులు బుధవారం బాగా పొద్దుపోయిన తరువాత విడుదలయ్యారు. ఈ బందీలు ఈజిప్టు మీదుగా ఇజ్రాయెల్ చేరుకుంటారని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక బందీలు విడుదల కావడం ఆరోసారి. ఇప్పుడు ఇజ్రాయెల్ 30 మంది పాలస్తీనియన్లను విడుదల చేయాల్సి ఉంది. గురువారం నాటికి కాల్పుల విరమణ గడువు ముగిసిపోవలసి ఉన్నా హమాస్ నుంచి అదనంగా మరికొంతమంది బందీలు విడుదల కావలసి ఉన్నందున ఈ గడువును పొడిగింప చేయడానికి అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. ఇంకా 150 మంది బందీలుగా ఉన్నారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News