Thursday, February 13, 2025

బందీలను విడుదలచేస్తానన్న హమాస్

- Advertisement -
- Advertisement -

కైరో: గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణకు మార్గం సుగమం చేసేందుకు మరింత మంది బందీలను విడుదల చేస్తామని హమాస్ గురువారం తెలిపింది. అడ్డంకులను తొలగిస్తామని మధ్యవర్తి దేశాలైన ఈజిప్టు, ఖతార్ హామీ ఇచ్చాయని ఆ మిలిటెంట్ గ్రూప్ తెలిపింది. శనివారం మరింత మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనున్నట్లు హమాస్ తన ప్రకటనలో పేర్కొంది. కాగా హమాస్ ప్రకటనపై ఇజ్రాయెల్ వెంటనే ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. హమాస్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతానికి కాల్పుల విరమణకు మార్గం అయితే సుగమం చేసింది. కానీ భవిష్యత్తు సందేహస్పదమనే చెప్పాలి.

బందీలను కనుక విడుదలచేయకపోతే దాడులను తిరిగి కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుగా ఉన్నాడు. కైరోలో ఈజిప్టు అధికారులతో తమ ప్రతినిధులు చర్చలు జరిపారని హమాస్ తెలిపింది. యుద్ధానికి ముగింపు పలకడానికి హమాస్ మరింత మంది ఇజ్రాయెల్ బందీలను విడుదలచేయనున్నది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మీద దాడిచేయడంతో 2023 అక్టోబర్ 7న యుద్ధం మొదలయింది. దాదాపు 1200 మంది సివిలియన్లు చనిపోయారు. హమాస్‌తో చేసుకున్న ఒప్పందాలతో ఇప్పటి వరకు సగం కన్నా ఎక్కువ మంది బందీలను విడుదల చేయడం జరిగింది.

యుద్ధంలో దాదాపు 48000 మంది పాలస్తీనీయులు చనిపోయారు. వారిలో చాలా వరకు మహిళలు, పిల్లలు ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో 90 శాతం ప్రజలు నిరాశ్రయులయ్యారు. గాజా ప్రాంతం చాలా వరకు శిథిలమైంది. ఈ నేపథ్యంలో కొత్తగా మళ్లీ యుద్ధం అంటూ మొదలయితే అది ఘోరంగా ఉండనున్నది. ట్రంప్ ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉంది. ఆయుధాల తరలింపుపై ట్రంప్ ఆంక్షలను కూడా ట్రంప్ తొలగించాడు. పైగా యుద్ధం ముగిస్తే ఇజ్రాయెల్ గాజా నియంత్రణను అమెరికాకు ఇవ్వగలదని కూడా ట్రంప్ తెలిపాడు. దాంతో ‘మధ్యప్రాచ్యంలో రివేరా’ పునరుద్ధరించబడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News