Friday, December 27, 2024

ఇజ్రాయెల్‌కు షాక్ ఇచ్చిన హమాస్… 21 మంది సైనికులు మృతి

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ తీవ్రవాదులు ఆర్‌పిజి లాంచర్‌తో దాడి చేయడంతో ఇజ్రాయెల్‌కు చెందిన 21 మంది సైనికులు మృతిచెందారు. ఇప్పటికే ఇజ్రాయెల్ సైనికులు గాజాలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్నారు. ఆస్పత్రులు, శరణార్థుల శిబిరాలపై కూడా ఇజ్రాయెల్ దాడికి పాల్పడుతోంది. సెంట్రల్ గాజాలో రెండు భవనాలను కూల్చేందుకు ఇజ్రాయెల్ సైనికులు ప్రయత్నిస్తుండగా వారిపైకి హమాస్ గ్రనేడ్‌తో దాడి చేసింది. మందు గుండు పేలిపోవడంతో ఇజ్రాయెల్‌కు చెందిన 21 మంది సైనికులు దుర్మరణం చెందారు. హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన తరువాత ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి ఇజ్రాయెల్ వివరించింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 25 వేలకు మందికి పైగా గాజా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల భవనాలను ఇజ్రాయెల్ సైన్యం నేలమట్టం చేసింది. 23 లక్షల మంది ప్రజలు గాజాను వదిలి ఇతర దేశాలకు వలసపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News