Friday, December 20, 2024

హమాస్ టాప్ కమాండర్ హతం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఇజ్రాయెల్ సైన్‌యం గతవారం జరిపిన దాడుల్లో హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సలివన్ ప్రకటించారు. హమాస్ మిలిటరీ డిప్యూటీ కమాండర్ అయిన ఇస్సా సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్‌స్ట్రైక్‌లో మరణించినట్టు అమెరికా పేర్కొంది. మిగతా టాప్ కమాండర్లు టన్నెల్స్‌లో దాక్కున్నారని జేక్ పేర్కొన్నారు.

సెంట్రల్ గాజా లోని ఒక భూగర్భ సొరంగంలో దాక్కున్న ఇస్సా లక్షంగా మార్చి 11న ఎయిర్ స్ట్రైక్ చేసినట్టు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. హమాస్ మిలిటరీ అధిపతి మహమ్మద్‌దీఫ్ డిప్యూటీగా ఇస్సాను పేర్కొంటారు. గత ఐదు నెలలుగా సాగుతున్న దాడుల్లో ఇస్సా మృతి చెందడం ఇజ్రాయెల్ అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. కార్యకలాపాల్లో ఇస్సా చాలా చురకుగా ఉండేవాడని , అక్టోబర్ 7 నాటి మారణ కాండలో కీలక పాత్ర వహించాడని ఇజ్రాయెల్ భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News