Tuesday, January 21, 2025

నేటి గూగుల్ డూడుల్ లో భారత తొలి మల్ల యోధురాలు హమీదా బాను

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేటి గూగుల్ డూడుల్ లో భారత మొట్టమొదటి మహిళా రెజ్లర్ హమీదా బాను చిత్రం కనిపిస్తోంది. ఈ డూడుల్ ను బెంగళూరుకు చెందిన దివ్య నేగి చిత్రీకరించింది. 1954 లో ఇదే రోజున (04 మే) కేవలం 1.34 నిమిషాల్లో ప్రముఖ రెజ్లర్ బాబా పహిల్వాన్ ను ఓడించి హమీదా బాను ‘అమెజాన్ ఆఫ్ అలీఘఢ్’గా పేరు తెచ్చుకుంది. ఆమె భారత దేశపు మొట్ట మొదటి ప్రొఫెషనల్ రెజ్లర్. ఆమె స్మారకార్థం నేడు గూగుల్  ఈ డూడుల్ ను డిస్ ప్లే చేసింది.

మధ్యప్రదేశ్ లో పుట్టిన హమీదా బాను జీవితంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. పైగా తనను ఓడించిన వారిని పెళ్లి చేసుకుంటానని సవాలు కూడా విసిరింది. ఆమెను ఓడించడానికి బరిలోకి దిగిన దిగ్గజ పహిల్వాన్లను ఆమె మట్టికరిపించింది. 1954 లో మే 4న జరిగిన రెజ్లింగ్ పోటీలో కేవలం 1.34 నిమిషాల్లోనే ప్రముఖ రెజ్లర్ బాబా పహిల్వాన్ ను ఓడించి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఆ ఓటమి తర్వాత పహిల్వాన్ బాబా రెజ్లింగ్ నుంచి విరమించుకున్నారు. హమీదా బాను 1900 ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ లోని అలీఘఢ్ సమీపంలో రెజ్లర్ల కుటుంబంలో జన్మించారు. చిన్నపటి నుంచే రెజ్లింగ్ అభ్యసించారు.

రష్యా రెజ్లర్ వెరా చిస్తిలిన్ ను కేవలం రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఓడించి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. అప్పట్లో మీడియాలో కూడా ఆమె మంచి గుర్తింపును పొందారు.

Hamida Banu

Hamida Banu paper clip

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News