Friday, January 17, 2025

సుందరకాండ నుంచి ఎనర్జిటిక్ మెలోడీ

- Advertisement -
- Advertisement -

హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ’సుందరకాండ’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.

లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ బహుశ బహుశ సాంగ్ చార్ట్‌బస్టర్ హిట్ అయ్యింది. మేకర్స్ సెకండ్ సింగిల్ హమ్మయ్య సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ని ఫుట్ ట్యాపింగ్ మెలోడీగా కంపోజ్ చేశారు. లియోన్ జేమ్స్, రామ్ మిర్యాల తమ ఎనర్జిటిక్ వొకల్స్‌తో మైమరపించారు. శ్రీహర్ష ఈమాని లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్‌లో నారా రోహిత్ డ్యాన్స్ మూమెంట్స్ అలరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News