హైదరాబాద్: టాలీవుడ్ లో పలు ప్రత్యేక గీతాల్లో నటించిన నటి హంసానందిని క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. తనకు గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని తన ఇస్టాగ్రామ్ పేజిలో వెల్లడించింది. చికిత్సకు వెళ్లే ముందు తీసుకున్న ఫోటోను ఈ సందర్భంగా షేర్ చేస్తూ.. నాలుగు నెలల క్రితం తనకు క్యాన్సర్ బయటపడిందని తెలిపింది. ప్రస్తుతం కీమో థెరఫీ చికిత్స మొదలైందని, మీ అందరి అశీస్సులతో క్యాన్సర్ ను జయించి, మరింత ఉత్సాహంతో త్వరలోనే మళ్లీ తెరమీదకు వస్తానని పేర్కొంది.
No matter what life throws at me, no matter how unfair it may seem, I refuse to play the victim. I refuse to be ruled by fear, pessimism, and negativity. I refuse to quit. With courage and love, I will push forward. pic.twitter.com/GprpRWtksC
— Hamsa Nandini (@ihamsanandini) December 20, 2021
Hamsa Nandini Diagnosed with Breast Cancer