Wednesday, January 22, 2025

అర్ధరాత్రి హనుమకొండలో మహిళపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

వరంగల్: అర్ధ రాత్రి ఆటో ఎక్కినందుకు మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన హనుమకొండ జిల్లా బీమారం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత గురువారం నయీంనగర్ చెందిన ఓ వివాహిత పని మీద బయటకు వెళ్లింది. ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 12 కావడంతో కెయు క్రాస్ రోడ్డు వద్ద ఆటో కోసం ఎదురుచూస్తుంది. అదే సమయంలో ఆటో రావడంతో రంగ్‌బార్‌కు వెళ్లాలని డ్రైవర్ సూచించింది. ఆటోలో మహిళ ఎక్కగానే తన స్నేహితులు సనత్, సతీష్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.

Also read: నేడే బిసి గురుకుల కాలేజీల ప్రవేశ పరీక్ష

కొంచెం దూరం పోయిన తరువాత వాళ్లిద్దరూ ఆటో ఎక్కారు. ఆటో రూట్ మార్చి బీమారం వైపు వెళ్తుండడంతో మహిళ అరవడం ప్రారంభించింది. సనత్, సతీస్ ఆమెను ఆరవకుండా బిగ్గరగా పట్టుకున్నారు. బీమారం శివారులోకి వెళ్లిన తరువాత ఒకరి తరువాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. తరువాత రంగ్‌బార్ వద్ద ఆమెను దించి వెళ్లిపోయారు. మహిళ తన ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీస్ అధికారి శ్రీనివాస్ జీ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News