జిల్లాలో పిల్లల వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి
-అభినందనలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : టీనేజర్లకు వ్యాక్సినేషన్‌లో హన్మకొండ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో 15- నుంచి 17 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీ 100 శాతం పూర్తయింది. తద్వారా రాష్ట్రంలో ఈ కేటగిరీలో 100 శాతం పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా హన్మకొండ రికార్డు సొంతం చేసుకున్నది. జిల్లాలో 55,694 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించగా..లక్ష్యానికి మించి 101 శాతం మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 56,299 డోసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా అధికారులను, సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. హన్మకొండ ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.