Wednesday, January 22, 2025

తెగిపోయిన చేతిని అతికించిన వైద్యులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తెగిపోయిన చేతిని అతికించిన సందర్భాలు మనం చాలానే చూసి ఉంటాము. తాజాగా ఓ కంపెనీలో సిబ్బంది యంత్రాన్ని పరిశీలిస్తుండగా చేతి అందులో పడడంతో మణికట్టు వరకు తేగిపోయిన చేతిని అతికించిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ కంపెనీలో మేనేజర్ (55) కొత్త యంత్రాలు రావడంతో పరిశీలిస్తున్నాడు. ఓ యంత్రాని పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు చేతి అందులో పడిపోయింది. మణికట్టు వరకు చేతి తెగిపోవడంతో అతడిని బన్నేరుఘట్ట రోడ్డులో ఫోర్టీస్ ఆస్పత్రికి తరలించారు. ఏడు గంటల పాటు శస్త్ర చికిత్స చేసిన అనంతరం చేతిని అతికించారు. ఇప్పడు అతడి ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సకాలంలో తీసురావడంతో తాము వైద్యం చేయగలిగామని వైద్యులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News