Sunday, January 12, 2025

సిఈఐఆర్‌తో బాధితుడికి ఫోన్ అందజేత

- Advertisement -
- Advertisement -

చేర్యాల: పొగొట్టుకున్న ఫోన్‌ను సిఈఐఆర్ టెక్నాలజీతో బాధితుడికి ఫోన్‌ను అప్పగించిన సంఘటన చేర్యాట పట్టణంలో చోటు చేసుకుంది. చేర్యాల ఎస్‌ఐ బాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చేర్యాట పట్టణానికి చెందిన తిగుళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి తన రెడ్మి మొబైల్ ఫోన్‌ను 10న పొగొట్టుకున్నాడనీ ఈ క్రమంలో ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సిఈఐఆర్ వెబ్‌సైట్‌లో ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్‌ను ఎంటర్ చేసి బ్లాక్ చేయడం జరిగిందని తెలిపారు.

ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో ఈ వెబ్ సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం చేర్యాల పోలీసులకు చేరడంతో సమాచారం అందుకున్న పోలీసులు పోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ స్వాధీనం చేసుకొని గురువారం స్ధానిక పోలీస్ స్టేషన్‌లో వ్యక్తికి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ఎవరైతే ఫోన్ కోల్పోయిన వారు వెంటనే ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటి రిజిస్టర్ పోర్టల్ ద్వారా పొగొట్టుకున్న ఫోన్‌ను నేరుగా బ్లాక్ చేయవచ్చని తద్వారా కోల్పోయిన పోన్‌ను తిరిగి తొందరగా పొందుతారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News