Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో హ్యాండ్‌బాల్ అకాడమీ ఏర్పాటు చేస్తాం

- Advertisement -
- Advertisement -

క్రికెట్‌కు దీటుగా అభివృద్ధి, హ్యాండ్‌బాల్‌కు ఆదరణ భేష్
మన తెలంగాణతో సమాఖ్య అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు

Handball academy in Hyderabad

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో హ్యాండ్‌బాల్‌కు ఎంతో ఆదరణ లభిస్తోందని భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఆసియా లీగ్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఊహించిన దానికంటే మంచి స్పందన లభించిందన్నారు. భారత్‌తో సహా ఆసియాకు చెందిన పలు దేశాలకు చెందిన జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయని వివరించారు. ఈ క్రమంలో ఆయన మన తెలంగాణ క్రీడా ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో పలు విషయాలు వెల్లడించారు.

హైదరాబాద్‌లో అకాడమీ ఏర్పాటు..

క్రీడల అభివృద్ధిలో తెలంగాణ ఎంతో ముందంజలో ఉంది. ఇటీవల కాలంలో బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్, షూటింగ్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు అసాధారణ ఆటను కనబరుస్తున్నారు. బాక్సింగ్‌లో నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఇక షూటింగ్‌లో ఈషా సింగ్ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఈ క్రీడలకు దీటుగా హ్యాండ్‌బాల్‌ను కూడా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. త్వరలోనే హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హ్యాండ్‌బాల్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాం. దీని కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హ్యాండ్‌బాల్‌కు పెరుగుతున్న ఆదరణ..

ఇప్పటి వరకు దేశంలో క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, హాకీ, ఫుట్‌బాల్, బాక్సింగ్, షూటింగ్ తదితర క్రీడలకే ఆదరణ ఉండేది. అయితే తాను హ్యాండ్‌బాల్‌లోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రీడలకు దీటుగా హ్యాండ్‌బాల్‌ను తీర్చిదిద్దేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా. దీని కోసం భారత ఒలింపిక్ సంఘంతో పాటు అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య సహకారాన్ని తీసుకుంటున్నా. వారి సహాయసహకారాలతో హ్యాండ్‌బాల్‌ను మేటి క్రీడాగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News