Monday, December 23, 2024

దివ్యమైన ఆలోచన చేసిన ‘దివ్యాంగుడు’ సాయి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మహబూబాబాద్: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ దివ్యాంగుడు దివ్యమైన నిర్ణయాన్ని తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెలితే.. మహబూబాబాదద్‌లో దేవాదాయ, ధర్మాదాయ శాఖలో ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న నందనం కవిత తన 19 ఏళ్ల కుమారుడు పారుపల్లి సాయి తమ మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చి అందర్ని ఆలోచింపచేశారు. ఈ మేరకు అవయవాలను దానం చేసేందుకుగాను అంగీకార పత్రాలను తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ జిల్లా కన్వీనర్ పరకాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కె. శశాంకకు శనివారం అందజేశారు. సాయి పుట్టుకతోనే శరీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు.

వరంగల్‌లోని మల్లికాంబ మనోవికాసం కేంద్రంలో చదువుకుంటున్నాడు. దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుని తల్లీ కవితతో పాటు తన అవయవాలను తమ మరణానంతరం దానం చేసేందుకు ముందుకు వచ్చారు. తన అవయవాల ద్వారా ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మను ప్రసాదించిన వారమవుతామని వారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసకున్నామని వారు వివరించారు. ఈ మేరకు తమ అవయవాలను దానం చేసేందుకు అంగీకార పత్రాలను పరకాల రవీందర్ రెడ్డి ద్వారా జిల్లా కలెక్టర్ కె. శశాంకకు అందజేశారు. ఈ మేరకు వారి నిర్ణయాన్ని కలెక్టర్ అభినందించారు. తన వైకల్యంతో జన్మించిననాటి నుంచి ఎన్నో విధాలుగా అవస్థలు పడుతున్న సాయి అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

సాయితో పాటు అతని తల్లీ కూడా అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడం ఎందరికో స్పూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. వారి సాహసోపేతమైన ఈ నిర్ణయం అందరినీ ఆలోచింపచేస్తుందని పేర్కోన్నారు. ప్రతీఒక్కరూ వారి స్పూర్తిని పుణికిపుచ్చుకోవాలని కలెక్టర్ పిలుపునిస్తూ సాయిని ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News