Sunday, December 22, 2024

టిఎస్‌హెచ్‌డిసి ఏర్పాటుతో పెరిగిన హ్యాండి క్రాఫ్ట్ అమ్మకాలు

- Advertisement -
- Advertisement -
2022-23 నాటికి రూ.3520 లక్షల కోట్ల ఆదాయం
వెల్లడించిన ఎస్‌ఇఒ నివేదిక

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రలో తెలంగాణ అన్ని విధాలుగా వెనకబడింది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ,కళలకు నాటికి పాలకులు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో అవి పూర్తిగా మరుగున పడిపోయే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా హస్తకళలకు సంబంధించిన పరిశ్రమలు, దాని మీద ఆధారపడి జీవనాధారం సాగిస్తున్న వేలాది మంది హస్తకళకారులు ఆర్దికంగా అనేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం వారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ స్టేట్ హ్యాండీ క్రాఫ్ట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ( టిఎస్‌హెచ్‌డిసి ) ఏర్పాటు కావడంతో ఇటు పరిశ్రమలతో వాటి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికుల్లో జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది.

హస్తకళల అమ్మకం ద్వారా 2022 ( అక్టోబర్ ) నుంచి 2023 రూ. 3520 లక్షలు కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎస్‌ఈవో ( తెలంగాణ ఆర్దిక ముఖ చిత్రం ) నివేదిక తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్దిపై దృష్టి సారించిందని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని కళాకారులు అభివృద్దిపై దృష్టి సారించడమే కాకుండా వారి ద్వారా కొన్ని ప్రత్యేకమైన ఉత్పత్తులకు తయారీకి అవకాశం ఇచ్చింది. అంతే కాకుందా సదరు పరిశ్రమలను అభివృద్ధి చేసి వాటితో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు పేర్కొంది. తెలంగాణలో అనేక మంది హస్తకళకారులు ఉన్నారు. వారు బొమ్మలు, ఫర్నిచర్, వెండి ఫిలిగ్రీ ,ఇత్తడి గాజులు మొదలైన వస్తువులను ఉత్పత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఫర్నిచర్‌కు ప్రసిద్ది చెందింది. ఇది 2009 సంవత్సరలోనే జియోగ్రాఫికల్ ఇండికేషన్ హక్కులను పొందింది.

అదే విధంగా ఆదిలాబాద్‌లోని ఉషేగాన్ గ్రామం డోక్రా మెటల్ కళాకండాలకు ప్రసిద్ది చెందింది. వీటిని లాస్ట్ వాక్స్‌ను పద్దతిని ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. జనగాం జిల్లాలోని పెంబర్తి గ్రామం పెంబర్తి మెటల్ క్రాఫ్ట్‌లను తయారు చేస్తుంది. హస్తకళాకారులు ఫెర్ఫూమ్ సీసాలు ( సెంట్ సీసాలు) , కుండిలు, మెమోంటోలు వంటి వ్యక్తిత వస్తువులను తయారు చేస్తారు. పెద్ద కథనాలు, కథలను వర్ణించే చెరియాల్ పెయింటింగ్‌లు రూపొందించే కళకారులకు హైదరాబాద్ నిలయం. హస్తకళను,కళకారులను అభివృద్ది పరిచే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ స్టేట్ హ్యాండీ క్రాఫ్ట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్( టిఎస్‌హెచ్‌డిసీ) ఏర్పాటైంది. ఇది కళకారులకు సంక్షేమానికి సహాయన్ని అందించే లక్షంగా ఇది రూపు దిద్దుకుంది. 2015లో గోల్కోండ్ ట్రేడ్ (ఉమ్మడి ఏపిలో లేపాక్షి) మార్కును కలిగిన ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రహస్తకళల అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర హస్తకళలను ప్రచారం చేస్తోంది. దేశ వ్యాస్తంగా టిఎస్‌హెచ్‌డిసి 10 ఎంపోరియంలను కలిగి ఉన్నట్లు ఎస్‌ఈవో నివేదికలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News