Friday, November 22, 2024

దూసుకుపోతున్న టెక్స్‌టైల్స్

- Advertisement -
- Advertisement -

Handloom Minister KTR meets with officials

ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్న
జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు

మరింత అభివృదింధ
పరచడానికి వీలుగా రోడ్డు
మ్యాప్ తయారు
చేసుకోవడం అవసరం
నేతన్నల సంక్షేమం, వృద్ధి
సాధనే ప్రభుత్వ లక్షం
ఇందుకోసం అనేక
కార్యక్రమాలు చేపడుతున్నాం
వాటి సత్ఫలితాలు
కనిపిస్తున్నాయి ప్రాధాన్య
రంగంగా చేనేత :
అధికారులతో భేటీలో
మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టెక్స్‌టైల్స్ (వస్త్ర) రంగాన్ని మరింతగా అభివృద్ధి పరిచేందుకు రానున్న భవిష్యత్తుకు దానికి అవసరమైన రోడ్డు మ్యాప్ నివేదికను తయారు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి కె. తారకరామారావు ఆదేశించారు. ఇప్పటికే ఈ రంగంలో రాష్ట్ర సాధించిన ప్రగతిని చూసి అనేక కంపెనీల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకొస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వస్త్రరంగాన్ని మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు.

అందువల్ల ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన కా ర్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలపైన ఒక సమగ్ర ని వేదికను తయారు చేయాలన్నారు. నా డిక్కడ సంబంధిత అధికారులతో మంత్రి కెటిఆర్ స మావేశమయ్యారు. ఈ సందర్భఁగా టైక్స్‌టైల్స్ రం గం అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై ఆయన కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, గత ఏడున్నర సంవత్సరాలుగా టెక్స్‌టైల్స్ రంగంలోని నేతన్నల సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సత్ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ రంగంలో ఉపాధి కల్పనే ప్రాథమిక లక్ష్యంగా, నేతన్నల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. కేవలం నేతన్నలకు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా, దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి ఇస్తున్న ఈ రంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో టెక్స్‌టైల్స్ రంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్ పార్కుగా కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అంతర్జాతీయ కంపెనీలయిన యంగ్ వన్, దేశీయ టెక్స్‌టైల్స్ దిగ్గజమైన కిటెక్స్ వంటి అనేక కంపెనీలు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ఇక్కడి మానవ వనరులను, ప్రభుత్వ పాలసీలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే చేపట్టాల్సిన మౌలిక వసతులు, నూతన పాలసీలు, నేతన్నల కోసం చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనుబంధ రంగాల్లో తీసుకురావాల్సిన మరిన్ని కార్యక్రమాల వంటి అన్నింటిని ఈ నివేదికలో పొందుపరచాలని సూచించారు.

అలాగే టెక్స్‌టైల్స్ శాఖ తరఫున చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పాటు బడ్జెట్‌లో పొందుపరచాల్సిన కార్యక్రమాలు, పథకాలు, ఇతర అంశాలపైన ఉన్నతాధికారులకు మంత్రి కెటిఆర్ కొన్ని సూచనలు చేశారు. ఈ సమావేశంలో టెక్స్‌టైల్స్ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, టిఎస్‌ఐఐసి ఎండి వెంకట నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News