Friday, January 17, 2025

నాటి నిర్లక్ష్యమే నేటి నిరుద్యోగానికి కారణం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ నిర్మాణంలో టీచర్లు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా మారనున్నారు.తెలంగాణ ఉ ద్యోగాలు రావాలంటే కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావు, కవిత ఉద్యోగాలు ఊడాలని గతంలో చెప్పానని, చెప్పినట్టుగానే కెసిఆ ర్, కెటిఆర్, హరీష్‌రావు, కవిత కొలువులను ఊడగొట్టానని సిఎం రేవంత్ అ న్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు తీర్చలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రా వాలని నిరుద్యోగులు బాధ్యత తీసుకున్నారని, నిరుద్యోగులు అనుకున్నట్టుగానే 90 రోజుల్లో 30 వేల కొలువులు భర్తీ చేసి నియామకపత్రాలు అందించామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేసులు వేసి డిఎస్‌సి నోటిఫికేషన్‌ను అడ్డుకోవాలని కొంద రు కుట్రలు చేశారని ఆయన తెలిపారు. తెలంగాణ నిర్మాణంలో టీచర్లు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా మారబోతున్నారని ఆయన పేర్కొన్నారు. డిఎస్‌సి విజేతల సంతోషాన్ని చూసి కొందరు కళ్లల్లో కా రం పెట్టుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

డిఎస్‌సి విజేతలను చూస్తే దసరా ముందే వచ్చినట్లు అనిపిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు గత పదేళ్లు కోరి కొరివిదెయ్యాన్ని తెచ్చుకున్నారని సిఎం రేవం త్ తెలిపారు. ఆ కొరివి దెయ్యాన్ని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని సిఎం రేవంత్ ఆరోపించారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో టీచర్లకు ఉద్యోగ నియామకపత్రాల అందజేత కార్యక్రమంలో సిఎం రేవంత్ పాల్గొన్నారు. టీచర్లకు సిఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. నియామక పత్రాలు పంపిణీకి ముందు సిఎం రేవంత్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ అవుతాయని అందరూ ఆశిస్తే నిరాశే ఎదురయ్యిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన మూడేళ్లకు డిఎస్‌సి నోటిఫికేషన్ ఇచ్చిందని సిఎం ధ్వజమెత్తారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన రెండేళ్లకు నియామక ప్రక్రియ పూర్తయిందని ఆయన విమర్శించారు.

డిఎస్‌సి ద్వారా 65 రోజుల్లో 10,006 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేశాం
డిఎస్‌సి ద్వారా 65 రోజుల్లో 10,006 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేశామని, తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర కీలకంగా మారిందని ఆయన తెలిపారు. గతంలో విద్యాశాఖలో బదిలీలు, పదోన్నతులు లేవని, విద్యాశాఖ తన దగ్గరే ఉందని, సమస్యలు పరిష్కరించామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టీచర్లే తెలంగాణ వారధులు, నిర్మాతలని ఆయన అన్నారు. టీచర్లే తెలంగాణ వారధులు, నిర్మాతలు అని సిఎం రేవంత్ కొనియాడారు. పేద విద్యార్థులను ఉత్తమంగా తీర్చే బాధ్యత టీచర్లదేనంటూ బాధ్యత అప్పగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా లేరని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ టీచర్లకంటే అనుభవజ్ఞులు ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.

బడ్జెట్‌లో విద్యకు రూ.25 వేలు కోట్లు కేటాయించాం
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.125 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని వాటిని ఈ నెల 11వ తేదీన ప్రారంభించుకోబోతున్నామని ఆయన తెలిపారు. బడ్జెట్‌లో విద్యకు రూ.25 వేలు కోట్లు కేటాయించామన్నారు. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరిస్తున్నామని సిఎం- రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నామని గర్వంగా చెప్పుకునేలా వ్యవస్థను తయారు చేస్తామన్నారు. తెలంగాణలో ప్రతి ఏటా 1లక్షా 10వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారని, కానీ, ఉద్యోగాలు పొందలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలో గచ్చిబౌలిలో స్పోర్ట్ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నామని సిఎం తెలిపారు. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు, తెలంగాణ పునర్మిర్మాణానికి మీవంతు కృషి చేయాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News