Thursday, January 23, 2025

సిఈఆర్‌ఐతో బాధితుడికి ఫోన్ అప్పగింత

- Advertisement -
- Advertisement -

మద్దూరు: ఫోన్ పోగొట్టుకున్న బాధితునికి సిఈఆర్‌ఐ ద్వారా ఫోన్ గుర్తించి బాధితుడికి అప్పగించినట్లు మద్దూరు ఎఎస్‌ఐ విజయ్‌కుమార్ ఆదివారం విలేకరులకు తెలిపారు. మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన గుండెగోని శ్రీకాంత్ 24న చేర్యాల మండలం గుర్జకుంట వద్ద జేబు నుంచి ఫోన్ పడిపోయిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. సిఈఆర్‌ఐ పోర్టల్ ద్వారా ఫోన్ గుర్తించి ఫోన్ యజమాని శ్రీకాంత్‌కు అప్పగించినట్లు తెలిపారు. మండల ప్రజలు ఎవరైనా ఫోన్ పోయిన వెంటనే మద్దూరు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News