Wednesday, January 8, 2025

సిఈఆర్‌ఐతో బాధితుడికి ఫోన్ అప్పగింత

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ఫోన్ పొగొట్టుకున్న బాధితుడికి సిఈఆర్‌ఐ తో ఫోన్ గుర్తించి బాధితునికి అప్పగించినట్లు టూ టౌన్ సిఐ రవికుమార్ సోమవారం విలేకరులకు తెలిపారు . పోలీస్‌స్టేషన్ పరిధిలోని మందపల్లి గ్రామానికి చెందిన కనకయ్య 15 రోజుల క్రితం తన ఫోన్ పొగొట్టుకున్నారు. వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. సిఈఆర్‌ఐ పోర్టల్ ద్వారా ఫోన్ గుర్తించి ఫోన్ అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎవరైతే ఫోన్ పొగొట్టుకుంటే, గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన సిఈఐఆర్ పోర్టల్‌లో పూర్తి వివరాలు నమోదు చేసి పొగొట్టుకున్న ఫోన్‌ను నేరుగా బ్లాక్ చేయవచ్చని తద్వారా కోల్పోయిన పోన్‌ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పోర్టల్‌ను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మితే కొనవద్దని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News