Wednesday, January 22, 2025

రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

గంగారం: ఖరీఫ్ సీజన్‌లో రైతాంగానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందించాలని మండల అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం(ఏఐపీకేఎస్) ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఏఐపీకేఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రభాకర్ మాట్లాడుతూ.. రైతు బంధుతో పాటు సాగుకు అవసరమైన అన్ని రకాల వ్యవసాయ ఉపకరణాలను అందించాలని కోరారు. పంట రుణాలను పూర్తిగా రద్దుచేసి కొత్త రుణాలను అందచేయాలన్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఉచితంగా అందించాలన్నారు.

ప్రధానంగా మార్కెట్లోకి వస్తున్న నకిలీ విత్తనాలను అరికడుతూ విక్రాయలపై నిఘా ఉంచాలన్నారు. సమగ్ర పంటల బీమాను అన్ని రకాల పంటలకు వర్తింపచేయాలన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వ పరంగా లభించే అన్ని రకాల సబ్సిడీలను అందించాలన్నారు. పోడు సాగుచేసుకుంటున్న గిరిజన పేదలందదరికీ హక్కు పత్రాలిచ్చి రైతు బంధును అమలుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎస్ జిల్లా నాయకుడు ఈక బిక్షం, మండలాధ్యక్షుడు కుర్సం రంగయ్య, నాయకులు నాగేశ్వర్‌రావు, బుచ్చిరాములు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News