Friday, April 4, 2025

గృహ హింస కేసు.. బాంబే హైకోర్టుకు హన్సిక

- Advertisement -
- Advertisement -

గృహ హింస కేసు ప్రముఖ నటి మోత్వానీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సోదరుడు ప్రశాంత్ మోత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ జేమ్స్ తనపై, తన తల్లిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ హన్సిక కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. గురువారం పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌లు సారంగ్ కొత్వాల్, ఎస్ఎం మోదక్‌ల ధర్మాసనం.. ముస్కాన్ కు నోటీసులు జారీ చేసింది.

కాగా, టీవి నటి అయిన జేమ్స్, ప్రశాంత్ మోత్వానీని 2020లో వివాహం చేసుకున్నారు. అయితే, 2022 నుండి ఇద్దరు విడిగా నివసిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ మోత్వానీ తనపై గృహ హింసకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. హన్సిక, ఆమె తల్లిపై గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేయడంతో వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. అయితే, వారు కోర్టును ఆశ్రయించడంతో తన తల్లితోపాటు హన్సికకు ముందస్తు బెయిల్ లభించింది.తాజాాగా ఆ కేసును కొట్టివేయాలని హన్సిక పిటిషన్ దాఖలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News