- Advertisement -
ముంబై: సినీ నటి హన్సిక మోత్వాని, ఆమె తల్లిపై గతంలో గృహహింస కేసు నమోదైన విషయం తెలిసిందే. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వాని. టివి నటి ముస్కాన్ జేమ్స్ 2020లో వివాహం చేసుకొని.. 2022లో కొన్ని కారణాల వల్ల విడిపోదామని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ముస్కాన్ హన్సిక, ఆమె సోదరుడు, తల్లి జ్యోతిపై గృహహింస కేసు పెట్టింది. ఈ కేసులో 2025 ఫిబ్రవరిలో హన్సికతో పాటు ఆమె తల్లికి ముంబై సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తాజాగా తమపై ఉన్న ఈ కేసును కొట్టివేయాలంటూ.. హన్సిక బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేసింది. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ ఎస్.ఎం మోదక్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి.. హన్సిక సోదరుడి భార్యకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది.
- Advertisement -