- Advertisement -
“కొత్త చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ టీమ్‌కి ఆల్ ది బెస్ట్” అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేశారు బబ్లీ గర్ల్ హన్సిక. ఇంతలా తను సంతోషపడడానికి కారణం ప్రస్తుతం హన్సిక చేస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్’. ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్‌తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠభరితంగా సాగిపోయే కథ కధనంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. షూటింగ్ స్పాట్లోనే ఎడిటర్ శ్యామ్ పర్యవేక్షిస్తున్నారు. ‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’, ‘రీల్ టైం అండ్ రియల్ టైం’ ఈ చిత్రానికి హైలైట్స్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ విల్లాలో జరుగుతోంది. ఈ షూటింగ్లో చేరిన హన్సిక పై విధంగా ట్వీట్ చేశారు. రాజు దుస్సా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
- Advertisement -