Friday, January 24, 2025

దేశంలోనే తొలిసారిగా వినూత్న ప్రయోగం

- Advertisement -
- Advertisement -

వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలి ప్రయత్నంగా సింగిల్ షాట్‌లో సింగిల్ క్యారెక్టర్‌తో హన్సిక ప్రధాన, ఒకే పాత్ర పోషించగా రాజు దుస్సా రచన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ’వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్‌గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది.

ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటూ సాగే ఒక ఉత్కంఠ రేపే కథను సింగిల్ షాట్‌లో అంతే ఎంగేజింగ్‌గా తెరకెక్కించడం సాహసమే. హాలీవుడ్ లో సింగిల్ షాట్ టెక్నిక్ లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల తరహాలో ’వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ చిత్రం రూపొందించబడింది. ఈ వినూత్న ప్రయోగాన్ని భారతదేశంలోనే తొలిసారిగా తెలుగులో చేయడం గొప్ప విషయం. సింగిల్ క్యారెక్టర్‌తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హన్సిక అద్భుతంగా నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News