Monday, December 23, 2024

ఎన్‌సిబిసి చైర్‌పర్సన్‌గా హన్స్‌రాజ్ అహిర్ బాధ్యతల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్(ఎన్‌సిబిసి చైర్‌పర్సన్‌గా మాజీ కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కృషిచేస్తానని తెలిపారు. ఇతన వర్గాలతో సమానంగా వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడం ఒక సవాలుగా, బాధ్యతగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ నినాదాన్ని ఆచరిస్తూ బిసిల సంక్షేమానికి పాటుపడతానని ఆయన చెప్పారు. 2014 నుంచి 2019 వరకు కేంద్ర హోం వ్యవహారాలు, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా 68 ఏళ్ల అహిర్ పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News