Friday, December 20, 2024

టీజర్‌కు అద్భుత స్పందన..

- Advertisement -
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్. యంగ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తొలి చిత్రంగా వస్తున్న ‘హను-మాన్’ అన్ని భాషల ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్‌తో మేకర్స్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. ఇందులోని ప్రతి ఫ్రేమ్ చాలా ఆకర్షణీయంగా ఉంది. భగవంతుడు హనుమాన్ దర్శనంతో టీజర్ అద్యంతం అలరించింది. ప్రశాంత్ వర్మ విజన్, సూపర్ హీరోగా తేజ సజ్జ ఆకట్టుకున్నారు.

తాజాగా హనుమాన్ టీజర్ 50 మిలియన్ల వ్యూస్, 1 మిలియన్ ప్లస్ లైక్స్‌తో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. హనుమంతుడి ముందు తేజ సజ్జ చేతిలో గదతో నిలబడి ఉన్న పోస్టర్ అద్భుతంగా ఉంది. శ్రీరాముడి ఆశీస్సులు పొంది టీమ్ ఇటీవలే అయోధ్య నుంచి ప్రచార యాత్రను ప్రారంభించింది. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా చైతన్య సమర్పిస్తున్నారు. ‘హను-మాన్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News