Monday, January 20, 2025

ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్న ‘హను-మాన్’ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ హను-మాన్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాంబిరెడ్డి సినిమా తర్వాత తేజ, దర్శకుడు ప్రశాంత్ వర్మ క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా పట్ల అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదలైన ట్రైలర్ లో విజువల్స్, గ్రాఫిక్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ బేనర్ పై వస్తున్న ఈ సినిమాలో మూడు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. జనవరి 12న విడుదలవుతున్న హను-మాన్…సంక్రాంతి బరిలో నిలిచిన ఆరు పెద్ద సినిమాలను ఢీకొంటోంది. ట్రైలర్ ని చూస్తే, ప్రశాంత్ వర్మ తన సినిమా పట్ల ఎందుకంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్థమవుతుంది. తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. వినయ్ రాయ్ విలన్ గా చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ భాషలతోపాటు హను-మాన్ సినిమాని ఇంగ్లీష్, కొరియన్, చైనీస్, స్పానిష్, జపనీస్ భాషల్లోనూ విడుదలకు సిద్ధం చేయడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News