Saturday, December 28, 2024

ప్రభాస్ మూవీలో ఇమాన్వినే ఎందుకు?: కారణం చెప్పిన హను రాఘవపూడి

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా వినిపిస్తున్న సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న సినిమా కూడా ఒకటి. ఈ చిత్రంలో కొత్త నటి ఇమాన్వి… ప్రభాస్ సరసన నటిస్తున్నట్టుగా మేకర్స్ తెలియజేశారు. అయితే ఈ కొత్త హీరోయిన్‌ను ఎలా తీసుకున్నానో హను రాఘవపూడి తెలిపారు. తాను సోషల్ మీడియా ద్వారానే ఇమాన్విని చూశానని, ఆమె డాన్స్ వీడియోస్ చూశానని పేర్కొన్నారు.

అలా సోషల్ మీడియా ద్వారానే ఆమెని సంప్రదించామని, సినిమా కోసం ఆడిషన్ చేయడానికి పిలిచామని… అలాగే మొత్తం 15 రోజుల పాటు ఆడిషన్ స్క్రీన్ టెస్ట్ చేశామన్నారు. ఈ స్క్రీన్ టెస్ట్‌ని ప్రభాస్‌కి కూడా చూపించగా తనకి కూడా ఇమాన్వి ఈ చిత్రానికి పర్ఫెక్ట్ అని అనిపించడం తోనే ఆమె ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి ప్రవేశించిందని హను వివరించారు. ఇలా ఈ యంగ్ నటి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News