Sunday, December 22, 2024

హనుమకొండలో కారును ఢీకొట్టిన లారీ: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఏటూరు నాగారానికి చెందిన ఓ కుటుంబం వేములవాడ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా పెంచికల పేట వద్ద ప్రమాదం జరిగింది. మృతులు భారత్, చందన, శంకర్, కాంతయ్యగా గుర్తించారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News